రంగారెడ్డి, మార్చి 11 (నమస్తేతెలంగాణ) : సీఎం సారూ తాగునీరు ఇప్పించండి అని ఆదర్శ పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్న ఘటన రంగారెడ్డి జిల్లా బొంగులూరులో చోటుచేసుకుంది. పాఠశాలలో తాగునీటిసౌకర్యం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు స్వయంగా డ బ్బులను పోగుచేసుకుని తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండల ఆదర్శ పాఠశాలను బొంగులూరు ఇందిరమ్మ కాలనీ సమీపంలో నిర్మించారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు బొంగులూరుగేటు వద్ద దిగి మోడల్స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. పాఠశాలకు బస్సు సౌక ర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సీఎం చొరవ తీసుకుని తాగునీరు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.