సికింద్రాబాద్, ఫిబ్రవరి7 : ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాంకాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్ సైన్సు విద్యార్థులు శుక్రవారం ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టారు. 18వ తేదీ నుంచి జరగనున్న మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల సమయంలో పలు పరీక్షలు సైతం ఉండటంతో వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సిలబస్ కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్స్ మాత్రం సిలబస్ పూర్తి అయిందని పేర్కొంటున్నారు.