మొయినాబాద్, జనవరి 23: ఫీజులు కట్టలేదని విద్యార్థులను గదిలో బంధించిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధి నాగిరెడ్డిగూడ రెవెన్యూలో పరిధి సుజా త పాఠశాలలో శుక్రవారం చో టుచేసుకున్నది. విద్యార్థులకు యూనిట్ టెస్ట్లు ఉండటంతో ఫీజులు చెల్లించనివారిని పరీక్ష రాయనీయకుండా గదిలో బంధించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఫీజులు కట్టనందుకు గదిలో ఎలా బంధిస్తారని మండిపడ్డారు. పాఠశాల యాజమాన్యం, సిబ్బందిపై మండిపడ్డారు. యాజమాన్యం దిగివచ్చి సర్దిచెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.