జగిత్యాల, జనవరి 25 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్లో ఉన్న సీఎస్ఐ ప్రాథమిక పాఠశాల ఆవరణను శుభ్రపరిచేందుకు శనివారం విద్యార్థులతో చీపుర్లు పట్టించారు అక్కడి హెచ్ఎం వినోద్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హెచ్ఎం ఆదేశాల మేరకు విద్యార్థులు చెత్తను ఊడ్చి పక్కన పారేశారు.
కాగా, ఆవరణలో కండోమ్ ప్యాకెట్లు కనబడటంతో విషయం తెలుసుకున్న మీడియా.. హెచ్ఎంతోపాటు సీఎస్ఐ చర్చి కార్యదర్శులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం వచ్చింది. ఈ విషయమై డీఈవో రాములును వివరణ అడగగా ఎంఈవోతో విచారణ చేయిస్తామని తెలిపారు.