పెంట్లవెల్లి, జూన్ 17 : నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగు నీళ్లకోసం ఫీట్లు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. నల్లాల ద్వారా నీళ్లు సరఫరా కాకపోవడంతో మధ్యాహ్నభోజనం తిన్నాక విద్యార్థులు నీటి సంప్ వద్దకు పరుగులు పెడుతున్నారు. నీళ్లు అందకపోవడంతో ప్రమాదకరంగా ఫీట్లు చేస్తున్నారు. దీనిపై హెచ్ఎం కురుమయ్యను వివరణ కోరగా.. నల్లా పనిచేయడం లేదని..అందుకే వెళ్లారని చెప్పుకొచ్చారు. సంప్ వద్ద విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి నిధులు సమకూర్చాం. బడిలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ నిధులు ఖర్చు చేసి పరిష్కరించుకోవాలి. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..