కన్నెపల్లి, మార్చి 21 : తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్కు చెందిన మంచర్ల శ్రీలత కన్నెపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఆమె తండ్రి మల్లయ్య గురువారం మృతిచెందాడు. శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, విద్యార్థిని శ్రీలత ఓ వైపు తండ్రి అంత్యక్రియలు జరుగుతుండగా చదువుపై ఉన్న మక్కువతో పరీక్షకు హాజరైంది.