హైదరాబాద్, మే3 (నమస్తే తెలంగాణ): విద్యార్థులపై ఫీజుల భారంమోపే జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే త్వరలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో విద్యార్థులు జీవో 7 ప్రతులను చేతబట్టుకొని మోకాళ్లపై నిల్చొని వినూత్న నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడారు. ఫీజులను తాము కట్టలేమని, ఆ భారం తమపై మోపొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు అశోక్, బాలకృష్ణ, చరణ్, ఓంకార్, ప్రవీణ్, అమన్, నవీన్ పాల్గొన్నారు.