నార్నూర్, జనవరి 23: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థి రాథోడ్ బన్నీ(15) ఖోఖో ఆడుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం.. బన్నీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.
బన్నీ ఖోఖో ఆడుతూ స్పృహ కోల్పోయాడు. అతన్ని నార్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎంఈవో పవార్ అనిత, ట్రెయినీ అఖిల్ వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ సర్పంచ్ రాథోడ్ విష్ణు, జాదవ్ రేణుక డిమాండ్ చేశారు.