జహీరాబాద్, నవంబర్ 2: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పాఠశాలలో సాత్విక్ (12) ఐదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల మూడో అంతస్తులోని హాస్టల్ రూంలో ఇనుప మంచానికి కట్టిన తాడుతో విద్యార్థులు ఆడుకుంటుండగా మంచంపై కూర్చున్న సాత్విక్ కింద పడిపోయాడు. వెంటనే ఇనుప మంచం సాత్విక్ తలపై బలంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల యాజమాన్యం పట్టణంలోని ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు దవాఖానకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి స్వస్థలం కర్ణాటకలోని కలబురిగి జిల్లా కుంచారం తాలూకా శివరాంపూర్. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్ణణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మనోహరాబాద్, నవంబర్ 2 : మెదక్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మన్నె కుమార్, లావణ్య దంపతులకు సంజ న, సహస్ర, శాన్విక ముగ్గురు పిల్లలు. వీరిలో మన్నె లావణ్య (30), ఆమె పిల్ల లు సహస్ర (7), శాన్విక (6) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లిలో బంధువుల ఇంట్లో ఆదివారం జరిగే శుభకార్యానికి శనివారం రాత్రి 7 గంట లకు బయలుదేరారు. లావణ్య బావ మన్నె ఆంజనేయులు (46) తన బైక్‌పై శభాష్‌పల్లి బస్టాప్ వద్ద దించేందుకు వెళ్తుండగా గ్రామ శివారులో రైతులు రోడ్లపై వడ్లు ఆరబోయగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.