శాలిగౌరారం, డిసెంబర్ 26 : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మరిమద్దె గ్రామానికి చెందిన విద్యార్థి డెంగ్యూతో గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన జనగాం నాగరాజు, సైదమ్మ దంపతుల కుమారుడు పవన్ (16) మండలంలోని వల్లాల గ్రామ మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు. పవన్‌కు వారం రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు నకిరేకల్‌లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. జ్వరం తగ్గక పోవడంతో నల్లగొండకు తరలించారు. పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా నిర్ధారించి చికిత్స అందించారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.