కొండమల్లేపల్లి, జనవరి 22: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీగురుకుల విద్యార్థిని సోమవారం ప్రార్థనా సమయంలో కుప్పకూలి మృతి చెందింది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేటకు చెందిన దాసరి ఆంజనేయులు-ఆండాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దాసరి భార్గవి(14) కొం డమల్లేపల్లిలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నది. ఉదయం ప్రార్థన చేస్తుండగా కింద పడిపోయింది. దేవరకొండలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.