భిక్కనూరు, ఆగస్టు 3: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్‌కు చెందిన అశ్విని(24) సౌత్ క్యాంపస్‌లో పీజీ చదువుతున్నది. హాస్టల్ గదిలో ఆదివారం సాయంత్రం చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా బీ రత్నాకర్ ఎన్నికయ్యారు. సీపీఎస్‌ను రద్దుచేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని, పీఆర్సీని తక్షణమే ప్రకటించి, మెరుగైన ఫిట్‌మెంట్‌ను అమలుచేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని చెన్నయ్య, రత్నాకర్ డిమాండ్ చేశారు.