ఆర్మూర్‌టౌన్, జూలై 19: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని గిరిజన గురుకుల కళాశాలలో శనివారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్మూర్ పో లీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ (17) ఆర్మూర్ శివారులోని వేల్పూర్ గిరిజన గురుకుల కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. అతని తండ్రి దుబాయ్‌లో ఉండగా, తల్లి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వల స వెళ్లింది. మూడ్రోజుల క్రితం ఇంటికి వెళ్లి వచ్చిన సంతోష్ తోటి విద్యార్థుల తో సరదాగానే ఉన్నాడు. శనివారం ఉదయం హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. సంతోష్ ఆత్మహత్యను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు పోస్టుమార్టం గది వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, కాలేజీ ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ; దిగుబడులు రాక మనస్తాపం
కుంటాల, జూలై 19 : అప్పుల బాధ తో ఓ రైతు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాలలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కుంటాల కు చెందిన రాజారాం గజేందర్ (49) తనకున్న ఎకరంన్నర భూమితోపాటు మూడేండ్ల నుంచి ఒకరి దగ్గర తొమ్మిదెకరాలు, ఇంకొకరి వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండేండ్లుగా సరైన దిగుబడి రాక, పెట్టుబడికి ఖర్చులు పెరిగి ప్రైవేట్‌గా నాలుగు లక్షల వరకు అప్పు చేశా డు. వీటిని తీర్చే మార్గం లేక శనివారం ఉదయం గ్రామ శివారులోని ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకున్నాడు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.