హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన మాడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఏపీలో 010 పద్దు ద్వారా వేతనాలు ఇస్తున్నట్టుగా మన రాష్ట్రంలోనూ ట్రెజరీల ద్వారా చెల్లించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, మాడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విఠల్, ప్రధాన కార్యదర్శి బత్తిని సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.