మహబూబాబాద్ రూరల్, నవంబర్ 24 : లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన పాశవిక దాడికి సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్‌లో మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, టీ రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. నీచమైన రేవంత్‌రెడ్డిలాంటి పాలనను గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.
లగచర్ల రైతులకు మద్దతుగా మానుకోటలో శాంతియుతంగా ధర్నా నిర్వహించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. హైకోర్టు అనుమతితో సోమవారం మహా ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే ఈ మహాధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు లగచర్ల రైతులకు పక్షాన నిలిచి పోరాటం చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టడం వల్ల ఎస్పీ అనుమతి నిరాకరించినా, కోర్టు అనుమతితో గిరిజన మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రజాసంఘాల నాయకులు, గిరిజన సంఘాలు లగచర్ల రైతులకు మద్దతు తెలుపాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు తదితరులు పాల్గొన్నారు.