నేటి నుంచి హైర్ వెహికిల్స్ యజమానుల సమ్మె
నేటి (బుధవారం) నుంచి హైర్ వెహికిల్స్ యజమానులు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యాజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిలు పెట్టిన సుమారు రూ.170 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్టు యజమానులు వెల్లడించారు.
- 5 వేలకుపైగా వాహనాలు బంద్
- 18 నెలల బకాయిలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): నేటి (బుధవారం) నుంచి హైర్ వెహికిల్స్ యజమానులు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యాజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిలు పెట్టిన సుమారు రూ.170 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగుతున్నట్టు యజమానులు వెల్లడించారు. దీంతో పాటు తమకు ప్రతినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55వేలకు పెంచాలని కోరారు.
నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సుమారు 5వేలకుపైగా వాహనాలు నిచిలిపోనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్‌యాదవ్, జనరల్ సెక్రటరీ రాజు తెలిపారు. దాదాపు 5వేలకు పైగా ఉన్న అద్దె వాహనాలకు ప్రభుత్వం 18 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, ఈఎంఐలు చెల్లించలేక యజమానులు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారని పేరొన్నారు. ఈఎంఐలు చెల్లించలేక తమ వాహనాలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వాహనాలను జప్తు చేసే పరిస్థితి నెలకొన్నదని జనరల్ సెక్రటరీ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

