హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): వ్య వసాయం పేరిట కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆమె పోడు భూములపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుం డా, వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విష యం తమ దృష్టికి వచ్చిందని తెలిపా రు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీ పై నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూ ములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వి వరించారు. దీనికి మంత్రులు స్పం ది స్తూ, పక రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇకడి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి.. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
బోనాల పండుగకు రూ.25 కోట్లు
బోనాల పండుగ ఏర్పాటుకు రూ. 25 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్టు దేవాదా య, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. బోనాల పండుగను జూలై 7 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లాలోని 3 వేలకు పైగా దేవాలయాలకు బోనాల జాతర నిర్వహణకు రూ. 25 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించాల్సిందిగా సీఎంను కోరామని చెప్పారు.