హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖ నిబంధనలు పాటించకుండా వాహనాలను విక్రయిస్తున్న షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ జాయింట్ రవాణాశాఖ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. వినియోగదారులకు వాహనాలను విక్రయించేటప్పుడు ఆర్టీఏ చార్జీలు లేక ఇతర చార్జీల పేరిట వసూలు చేసే నిర్వాహకులపై తాత్కాలిక రిజిస్ట్రేషన్ సస్పెండ్తోపాటు చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.