హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించే పబ్బులు,బార్లు, క్లబ్బులపై కఠిన చర్య లు చేపడతామని డీజీపీ రవిగుప్తా సోమవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. వాటి నిర్వాహకులను, డ్రగ్స్ సరఫరాదారులను జైలుకు పంపడం తోపాటు వారి ఆస్తులను సీజ్ చేస్తామని తెలిపారు.టీనేజ్ పిల్లలని తల్లిదండ్రులు గమనిస్తూండాలని పోలీసు శాఖ ఎక్స్ వేదికగా విన్నవించింది. ఈ విషయం లో అనుమానంగా వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని సూచించింది.
వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3,891.813 కిలోల డ్రగ్స్‌ను రాచకొండ పోలీసులు సోమవారం దహ నం చేశారు.వీటి విలువ రూ.5,03, 31,483 ఉంటుందని సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. ఇందులో 3,484.465 కిలోల గంజాయి, 402.200 కిలోల ఓపీఎం, 14 గ్రాముల ఎండీఎంఏ, 3.5 కిలోల హాష్ ఆయిల్, 45 గ్రాముల మెఫెడ్రోన్, 958 గ్రాముల ఛారస్, 100 గ్రాముల గంజాయి చాక్లెట్లు ఉన్నాయని తెలిపారు.