హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : వైద్యులు, సిబ్బంది విధులకు తరుచూ గైర్హాజరవడం, నిర్ణీత సమయం కంటే ముందే డ్యూటీ నుంచి వెళ్లిపోతే కఠిన చర్యలు తప్పవని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.
శనివారం హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామి లీ వెల్ఫేర్ కార్యాలయంలో నిర్వహించి న సమీక్షలో మంత్రి మాట్లాడుతూ మేజర్ సర్జరీలు చేసే పూర్తి స్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు అభివృద్ధి చెందాలని ఆదేశించారు.