BRS | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ‘సమాజం కులాల సముదాయం.. వృత్తుల సమాహారం. అందులో ఏ ఒక్క కులం, వర్గం, నిరాదరణకు గురైనా దాని ప్రభావం యావత్ సమాజం మీద పడుతుంది..’ అని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తొలినాళ్లలోనే కేసీఆర్ గుర్తించారు. అందులో భాగంగానే 2003 అక్టోబర్ 19న ‘తెలంగాణలో బీసీ పాలసీ’ని పార్టీ రూపొందించింది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ విధానాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీకి ఈ పాలసీలు ఎందుకు? రాష్ర్టాన్ని సాధించిన తర్వాత అన్నింటిపై ఆలోచించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, ఆయా వర్గాలు ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ దూరదృష్టితో సమాధానమిచ్చారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ముందే ఖరారు చేసిన రోడ్‌మ్యాప్‌నకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేసింది.
అందుకే పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ప్రగతిపథంలో పయనించాయని సామాజిక విశ్లేషకులు తేల్చిచెప్తున్నారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం విషయంలో తెలంగాణను కేసీఆర్ రోల్‌మాడల్‌గా నిలిపారని నాటి కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సహా జాతీయ బీసీ కమిషన్ అనేక సందర్భాల్లో కీర్తించిన ఉదంతాలు ఉన్నాయి. గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీ వంటి పథకాలతోపాటు చేనేత, కల్లుగీత సహా వృత్తిపనివారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, గౌడన్నల కోసం నీరా పాలసీ, కల్లు దుకాణాల పునరుద్ధరణ, రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి పథకాలతోపాటు ‘బీసీ ఆత్మగౌరవ’ భవనాల నిర్మాణం వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని, అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని బహుజనవర్గాలు కీర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బహుజన హితాయ.. బహుజన సుఖాయ’ అన్న అంతఃస్సూత్రాన్ని కేసీఆర్ ఆచరించి చూపారనే అభిప్రాయం స్థిరపడింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు.
బడుగులకు గొడుగు పట్టిన బీఆర్ఎస్
రాజకీయంగా 2003లో తీసుకున్న విధాన నిర్ణయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దాకా బడుగులకు గొడుగు పట్టింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేతగా సిరికొండ మధుసూదనాచారి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే వైస్ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ముదిరాజ్ ఉన్నారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీల్లోనే కాకుండా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల సారథులు, సభ్యుల్లో సింహభాగం బీసీలకు కేటాయించింది బీఆర్ఎస్సే అనేది నిర్వివాదాంశమని బహుజన నేతలు ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు.
2003లోనే బీసీల ఉన్నతికి బీజం
తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ అనంతరం అన్ని వర్గాల ప్రగతికి 2003తో సంబంధమున్నది. 2003 అక్టోబర్ 17, 18, 19వ తేదీలు తెలంగాణ సామాజికోద్యమ చరిత్రలో కీలకమైనవి. తొలిరోజు దళిత్ ఎంపవర్మెంట్పై గ్రీన్‌పార్క్ హోటల్లో సమావేశం, రెండో రోజు తెలంగాణ ఎస్టీ పాలసీ, మూడోరోజు బీసీ పాలసీని బీఆర్ఎస్ విడుదల చేసింది. 2004లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్.. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీల అభ్యున్నతికి నిధులు కేటాయించాలని డిమాం డ్ చేశారు. అలాగే డిసెంబర్ 18, 2004లో బీసీ నేతలు ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నాటి ప్రధాని మన్మోహన్సింగ్ దగ్గరికి తీసుకెళ్లి చర్చించారు.
బీఆర్ఎస్ 2003 బీసీ పాలసీలో ముఖ్యాంశాలు