హైదరాబాద్: స్టే సేఫ్ తెలంగాణ.. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి అయితే తప్ప, దయచేసి బయటికి వెళ్లొద్దని సూచించారు. చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తాత్కాలిక నిర్మాణాలు, పాడుబడ్డ భవనాలకు దూరంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, సహాయచర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేయాలని ఎక్స్ వేదికగా సూచించారు.
Stay safe Telangana
Please don’t step out unless it’s absolutely necessary. Take care of children and senior citizens at home. Stay away from temporary structures or any dilapidated buildings
I urge the @BRSparty leaders, workers and public representatives to stay vigilant… https://t.co/eapxShO9PJ
— KTR (@KTRBRS) September 1, 2024