హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : కేంద్రం పెంచిన ఇంధన ధరలతోపాటు గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ డిమాండ్ చేశారు. అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జూన్ 10న రాష్ట్రవ్యా ప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు నరసింహ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ సంస్థలైన ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం విపరీతంగా ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నటు తెలిపారు.
కేంద్రం లోని బీజేపీ అసమర్థ పాలన మూలంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించిందన్నారు.విద్యావ్యవస్థను సమూలంగా నాశనం చేస్తున్న ఆర్ ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు కేంద్రంలోని అన్ని వ్యవస్థల్లోకి ప్రవేశిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని రోడ్ల మీదికి వచ్చి బాధిత కుటుంబాల తల్లిదండ్రులు నిరసన తెలుపడం అభినందనీయమని ఈటీ నరసింహ పేర్కొన్నారు.