హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయినప్పటికీ తెలంగాణ, ఏపీ మధ్య వ్యక్తిగతంగా ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నిన్న ఏపీ మంత్రి బొత్స కుమారుడి వివాహానికి వెళ్లానని, ఏపీ నుంచి వచ్చిన నా సోదరుల ప్రేమతో పొంగిపోయాను’ అని ట్వీట్ చేశారు.
ఏపీ మంత్రి బోత్సా సత్యనారాయణ కుమారుడి వివాహం నగరంలోని మాదాపూర్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు, మంత్రి కేటీఆర్ కొద్దిసేపు సరదాగా గడిపారు. ఆ వేడుకకు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు.
Went to bless the son of AP MA&UD Minister @BotchaBSN garu yesterday, was overwhelmed with the love from my brothers from AP 😊
While we may have been separated as two separate geographical entities; Telangana & Andhra Pradesh, personal affections remain the same 🙏 #Grateful pic.twitter.com/3wkcgNmvC3
— KTR (@KTRTRS) February 12, 2022