హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్‌చేసి, వారి నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటన చాలా బాధకరమని కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని గద్వాల ఎస్పీని ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ అండగా ఉంటాయని ఆమె తెలిపారు.