హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్టేట్ టీచర్స్ యూనియన్-తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) 2024 నూతన సంవత్సరం డైరీని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయు లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉపాధ్యాయ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో ఎస్టీయూ టీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్‌రెడ్డి, జీ సదానంద్‌గౌడ్, ఆర్థికశాఖ కార్యదర్శి ఏ సదయ్య, అసోసియేట్ అధ్యక్షుడు వై కరుణాకర్‌రెడ్డి, డైరీ కన్వీనర్ సుధాకర్, పరమేశ్, రామసుబ్బారావు పాల్గొన్నారు.