హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్ తెలిపారు.
గురువారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ అనుబంధ తెలంగాణ ఆల్ హమాలీ అండ్ వరర్స్ యూనియన్ ముఖ్యకార్యకర్తల సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమిరె రాఘవులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో పలు తీర్మానాలు చేశారు.