హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్‌లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటింది. కేవలం హైదరాబాద్‌లోనే 2,873 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నిరుడు ఇదే సమయానికి హైదరాబాద్‌లో నమోదైన 2,658 డెంగ్యూ కేసుల కంటే ఈ ఏడాది 215 కేసులు అధికంగా నమోదయ్యాయి. జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధులు 6% పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4,580 టైఫాయిడ్, 249 చికున్‌గున్యా, 209 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. నిరుటితో పోలిస్తే ఈసారి హైదరాబాద్‌లో చికున్‌గున్యా, మలేరియా కేసులు పెరిగాయి. హైదరాబాద్‌లో నిరుడు 172 చికున్‌గున్యా, 28 మలేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 233 చికున్‌గున్యా, 34 మలేరియా, 1,168 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
ప్రజలు ఇండ్లలో తప్పనిసరిగా దోమతెరలు వాడాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లోకి దోమ లు రాకుండా చూసు కోవాలని సూచిస్తున్నా రు. పిల్లలను బయట కు తీసుకుని వెళ్లేటప్పుడు నిండుగా దు స్తులు తొడగాలని చె ప్తున్నారు. అధిక జ్వ రం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై ఎర్రమచ్చ లు, నీరసం, చికాకు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కాచి వడపోసిన నీటినే తాగాల ని, తాజా ఆహారం తి నాలని, పండ్లు, కూరగాయాలను శుభ్రమైన నీటిలో కడగాలని స్ప ష్టం చేస్తున్నారు.