హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆందోళనక కలిగిస్తున్నది. ఈ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం. పెద్ద రాష్ర్టాలైన తమిళనాడు, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలోనే అత్యధికంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం గమనార్హం. ఆయా రాష్ర్టాల్లో సింగిల్ టీచర్‌తో నడిచే స్కూళ్లు తక్కువగా ఉండగా, తెలంగాణ రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 26 వేలకు పైగా సర్కారు బడులుండగా, 5,821 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 21 శాతం స్కూళ్లు సింగిల్ టీచర్లతోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలో టీచర్ల లభ్యతకు ఇదే నిదర్శనంగా నిలుస్తున్నది. దేశంలోని 10 రాష్ర్టాల్లోనే ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా ఉన్నాయి. ఈ 10 రాష్ర్టాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉండటం గమనార్హం. ఏకోపాధ్యాయ స్కూళ్లలో దాదాపు అన్నీ ప్రాథమిక పాఠశాలలే. ప్రాథమిక విద్యయే పైచదువులకు పునాదిగా భావిస్తున్న ఈ రోజుల్లో సుమారు 6 వేల స్కూళ్లు సింగిల్ టీచర్లతో నడుస్తుండటం ఆందోళనకం. దేశవ్యాప్తంగా మొత్తం 99,973 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. దేశంలోని మొత్తం స్కూళ్లలో 10 శాతం స్కూళ్లు సింగిల్ టీచర్లతోనే నడుస్తున్నాయి.
గుణాత్మక విద్య అందేదెట్ట?
సర్కారు బడుల్లో చదివేవారంతా నిరుపేద విద్యార్థులే. 1 నుంచి 5 తరగతులకు ఒకే ఒక్క టీచర్ ఉండటంతో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడంలేదు. ఒకే టీచర్ అన్ని తరగుతులకు మొత్తం సబ్జెక్టులను బోధించడం తీవ్ర సమస్యగా మారుతున్నది. పైగా ఉన్న ఒక్క టీచర్‌కు అనారోగ్యం, ఏదైనా అత్యవసర సమస్య తలెత్తి సెలవుపెడితే పాఠశాలకు తాళం వేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉంటే ఆరోజు బడికి సెలవు ప్రకటించాల్సిందే. బోధన, బోధనేతర పనులన్నీ ఉన్న ఒక్క టీచర్‌పైనే పడుతున్నాయి. రికార్డుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం నిర్వహణను ఆ టీచరే పర్యవేక్షించాల్సి వస్తున్నది. విద్యాశాఖ అధికారులు రోజుకో ప్రొఫార్మా పంపి రోజుకో నివేదిక అడుగుతుంటారు. టీచర్లకు బోధనేతర పనులు అధికమయయ్యాయి. దీంతో విద్యార్థులకు గుణాత్మకమైన విద్య అందడంలేదు.
30