Telangana Budget : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి (Finance Minister) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువగా ఉందని చెప్పారు.
‘ప్రస్తుతం తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువ. రాష్ట్రంలో తలసరి ఆదాయ సగటు రూ.3,47,299 ఉంటే.. జాతీయ తలసరి ఆదాయ సగటు కేవలం రూ.1,83,236గా ఉంది. అంటే జాతీయ తలసరి ఆదాయ సగటుతో పోల్చితే.. రాష్ట్ర తలసరి ఆదాయ సగటు రూ.1,64,063 ఎక్కువగా ఉన్నది’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
అయితే తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్ర అంతరం ఉన్నదని, రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.9,46,862 ఉంటే.. వికారాబాద్లో రూ.1,80,241 ఉన్నదని ఆర్థిక మంత్రి చెప్పారు. జిల్లాల మధ్య ఉన్న ఆదాయ అంతరాలను తగ్గించడానికి తాము కృషి చేస్తామని మంత్రి తెలిపారు.