హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. రోడ్ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తక్షణమే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి రిలీవింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై ఆయన రిలీవింగ్ ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణాలోనే పనిచేస్తున్నారు.