DSP Transfers | రాష్ట్రంలో 47 మంది డీఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేస్తూ డీజీపీ రవిగుప్తా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ డీఎస్పీగా ఉన్న శ్రీనివాస్ తులను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖాళీగా ఉన్న ఏసీపీగా నియమించారు. మహబూబ్ నగర్ ఎస్బీ అండ్ సెక్యూరిటీ డీఎస్పీగా పని చేస్తున్న పీ నాగభూషణాన్ని ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖాళీగా ఉన్న శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ కోసం వేచి ఉన్న డీఎస్పీ నాధూని వాసు నారాగిరిని మహబూబ్ నగర్ ఎస్బీ అండ్ సెక్యూరిటీ డీఎస్పీగా నియమించారు.
ఏసీబీ డీఎస్పీగా పని చేస్తున్న మామిడిపల్లి వెంకట శ్రీనివాస రావును రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీఎస్పీ జోగుల నర్సయ్యను ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న డీఎస్పీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం చూస్తున్న డీఎస్పీ పింగిళి నరేశ్ రెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇంటెలిజెన్స్ డీఎస్పీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కిర్రా సతీశ్ బాబును వరంగల్ పీటీసీ డీఎస్పీగా నియమించారు. వరంగల్ పీటీసీ డీఎస్పీగా ఉన్న వడ్డె ప్రసన్న కుమార్ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డబ్ల్యూ అండ్ సీఎస్ డబ్ల్యూ ఏసీపీగా బదిలీ చేశారు.
సైబరాబాద్ డబ్ల్యూ అండ్ సీఎస్డబ్ల్యూ ఏసీపీ నారాయణ్ సింగ్ బీఎస్ ను ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈఓడబ్ల్యూ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. డీజీపీ కార్యాలయంలో వెయింటింగ్ లో ఉన్న డీఎస్పీ చింతా ఉమా మహేశ్వర రావును ఖాళీగా ఉన్న అమీర్ పేట పీటీసీ డీఎస్పీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న చత్తారి అంజయ్యను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా నియమించారు. డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ కోసం వేచి ఉన్న డీఎస్పీ సుదర్శన్ సంగేపాగును హైదరాబాద్ డీసీఆర్బీ డీఎస్పీగా నియమించారు. మహబూబ్ నగర్ డీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ డీఎస్పీగా ఉన్న ముద్దసాని కిరణ్ కుమార్ ను ఖాళీగా ఉన్న హైదరాబాద్ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ కందుల సత్యానారాయణను మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
డీజీపీ కార్యాలంయలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీ సుందరగిరి శ్రీనివాసరావును నిజామాబాద్ ఎస్బీ అండ్ సెక్యూరిటీ ఏసీపీగా, బాలాజీ అంబోత్ @ ఏ బాల్యను రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీగా, నర్సింగోజు వెంకటేశ్ ను ఖమ్మం ఎస్బీ అండ్ సెక్యూరిటీ ఏసీపీగా నియమించారు. పోస్టింగ్ కోసం వేచి ఉన్న చావా శంకర్ రెడ్డిని సిద్దిపేట సీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ ఏసీపీగా నియమించి, ఇంటెలిజెన్స్ కు అటాచ్ చేశారు.
డీజీపీ కార్యాలయంలో వెయింటింగ్ లో ఉన్న సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ ను ప్రస్తుతం సీఐడీ విభాగంలో ఖాళీగా ఉన్న డీఎస్పీగా నియమించారు. ములుగు డీసీఆర్బీ ఫంక్షనల్ డీఎస్పీగా ఉన్న ఎన్ సుభాష్ బాబును సైబర్ సెక్యూరిటీ డీఎస్పీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో ఖాళీగా ఉన్న దోనూరు భాస్కర్ రెడ్డిని సీఐడీలో పీఎస్ క్యూఎంయూ డీఎస్పీగా నియమించారు. డీజీపీ ఆఫీసులో వెయింటింగ్ లో ఉన్న సందిళ్ల లక్ష్మీ నారాయణను మహబూబ్ నగర్ సీసీఎస్ డీఎస్పీగా నియమించారు. మహబూబ్ నగర్ సీసీఎస్ డీఎస్పీగా ఉన్న లక్ష్మణ్ ను హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ ట్రాఫిక్ -4 ఏసీపీగా బదిలీ చేశారు.
డీజీపీ ఆఫీసులో వేచి చూస్తున్న గీడిపల్లి రణవీర్ రెడ్డిని రంగారెడ్డి డీసీఆర్బీ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు. డీజీపీ కార్యాలయంలో వెయింటింగ్ లో ఉన్న కొంతం చంద్రశేఖర్ రెడ్డిని మెదక్ జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా బదిలీ చేశారు. డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ కోసం చూస్తున్న పెంకుల మురళీ క్రుష్ణను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్బీ డీఎస్పీగా నియమించారు. రాజన్న సిరిసిల్ల ఎస్బీ విభాగం డీఎస్పీగా ఉన్న మహేష్ బాబును జగిత్యాల్ జిల్లా డీసీఆర్బీ ఫంక్షనల్ వెర్టికల్స్ డీఎస్పీగా బదిలీ చేశారు. డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వాసంశెట్టి మాధవిని కరీంనగర్ సీసీఆర్బీ ఏసీపీగా, కరీంనగర్ సీసీఆర్బీ ఏసీపీగా ఉన్న కాశయ్యను అదే కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగానికి బదిలీ చేశారు.
డీజీపీ ఆఫీసులో వెయింటింగ్ లో ఉన్న సర్వర్ మహ్మద్ ను రాజన్న సిరిసిల్లా జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా, సాయిని శ్రీనివాసరావును నిజామాబాద్ జిల్లా సీసీఎస్ ఏసీపీగా నియమించారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా ఉన్న జనపరెడ్డి విజయ సారధిని హైదరాబాద్ సిటీ సిట్ ఏసీపీగా బదిలీ చేశారు. డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ కోసం చూస్తున్న మల్లయ్య బండ్లను ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీగా, రమేశ్ కొత్వాల్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా నియమించారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఏ యాదగిరిని వరంగల్ కమిషనరేట్ సీసీఎస్ క్రైమ్ ఏసీపీగా నియమించారు. డీజీపీ ఆఫీసులో వెయిటింగ్ లో ఉన్న కల్కోట గిరి కుమార్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా, హసీబుల్లాను సెబర్ సెక్యూరిటీ డీఎస్పీగా, మ్యానం మట్టయ్యను సూర్యాపేట డీసీఆర్బీ డీఎస్పీగా, జూపల్లి శివరామయ్యను కరీంనగర్ పీటీసీ డీఎస్పీగా నియమించారు. కరీంనగర్ పీటీసీ డీఎస్పీగా ఉన్న ఏ రాములును ములుగు డీసీఆర్బీ డీఎస్పీగా బదిలీ చేశారు.
ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఎన్ సుధీర్ ను కుమ్రంబీమ్ అసిఫాబాద్ డీసీఆర్బీ డీఎస్పీగా నియమించారు. వెయిటింగ్ లో ఉన్న శ్రవణ్ కుమార్ తోట సుబ్రమణ్యాన్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ డీఎస్పీగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బుసిరెడ్డి రవీంద్ర రెడ్డిని సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ కొణం నర్సింహులను మహబూబ్ నగర్ డీటీసీ డీఎస్పీగా బదిలీ చేశారు. మహబూబ్ నగర్ డీటీసీ డీఎస్పీగా పని చేస్తున్న ఎస్ మురళీ క్రుష్ణను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ-2 ఏసీపీగా బదిలీ చేశారు.