హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు వివరాలను ఇవ్వాలని గోదావరి జీఆర్ఎంబీని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు జీఆర్ఎంబీకి అధికారులకు లేఖ రాశారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున జలాలను బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేలా ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ చేపట్టనున్న ప్రాజెక్టు వివరాలను అందివ్వాలని బోర్డుకు కోరింది. మీడియా కథనాలను లేఖతో అటాచ్ చేసింది.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నది. హోం పేజీ మొదలు ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా సతాయింపు తప్పడం లేదు. మొదటిసారి ‘సర్వీస్ అన్అవైలబుల్’ అనే ఎర్రర్ మెసేజ్ వెక్కిరిస్తున్నది. రెండుమూడు ప్రయత్నాల అనంతరం పేజీలు ఓపెన్ అవుతున్నాయి. ఆ పేజీలు లోడ్ కావడానికి ఎదురుచూడాల్సి వస్తున్నది. తేదీలు ఎంపిక చేసుకోవాలన్నా కష్టంగా మారింది. ప్రతి దశలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు మీసేవ నిర్వాహకులు, వినియోగదారులు వాపోతున్నారు.