ఆదిలాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నా యకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తో ఆదిలాబాద్లో కలెక్టరేట్ భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. భవ నం శిథిలాల వద్ద శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు హెల్మెట్లు ధరించి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.55 కోట్ల తో కొత్త కలెక్టర్ భవనాన్ని మంజూరు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించాలంటేనే వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.