Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జేఈఈ, నీట్, ఎప్‌సెట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న శిక్షణ సంస్థలను కట్టడిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చివరికి కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేయడంతో ఇప్పుడు మేల్కొన్నది. ఇటీవలి కాలంలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. దీనికితోడు వసతలు లేమి, సిబ్బంది కొరత వేధిస్తున్నది. అయినప్పటికీ ఫీజులు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
రాష్ర్టాలన్నీ వాటిని అమలుచేయాలని సూచించింది. ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తొలిసారి ఉల్లంఘిస్తే రూ. 25 వేలు, రెండోసారి మళ్లీ అదే పనిచేస్తే రూ. లక్ష జరిమానా విధించాలని సూచించింది. పదేపదే అదే పనిచేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది. వీటి అమలు విషయాన్ని రాష్ట్రం పెడచెవిన పెట్టింది. కేంద్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించారు. కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను ఇంటర్‌బోర్డుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
కేంద్ర మార్గదర్శకాల్లో ప్రధానమైనవి