హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (State Election Commissioner) రాణి కుముదిని (Rani Kumudini) మున్సిపల్ ఎన్నికలపై బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమావేశంలో చర్చించారు.
ఈ నెల 13 నాటికి పోలింగ్స్టేషన్ల వివరాల ముసాయిదాను ప్రచురించాలని ఎస్ఈసీ సూచించారు. ఈ నెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించారు. రేపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుందని చెప్పారు. కాగా ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ముగిశాయి.