హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టంచేశారు. 50 శాతం సబ్జెక్టులు పాసైన వారికే వర్తింపు అని ఈ నెల 21న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు.
ఆధారాలు లేకుండా వార్తలు ప్రచురించడం కరెక్ట్ కాదని, తప్పుడు సమాచారంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.