Congress | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న అధిష్ఠానం దూతను మార్చనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఢిల్లీ దూతపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీలో చేరికలు, పదవుల పంపకాలలో ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నా మినేటెడ్ పోస్టులు బహిరంగ మార్కెట్లో పెట్టి విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.
రాహుల్ గాంధీకి నమ్మకస్తునిగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అ ధిష్ఠానం ఆ దూతను మార్చే ఆలోచనతో ఉ న్నట్టు గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ వలస నేతకు ఎంపీ టికెట్ ఇప్పించారనే ప్ర చారం జరిగింది. ఆ ఎన్నికల్లో సదరు నేత ఓడిపోగా, మళ్లీ అతనికే ఎమ్మెల్సీ టికెట్ ఇ ప్పించేందుకు పావులు కదుపుతున్నట్టు సమా చారం. ఆ దూత స్థానంలో పొరుగు రాష్ట్రాలకు సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లు అధిష్ఠా నం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.