హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా సీఐ డీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ డీజీగా ఉన్న శిఖా గోయెల్ విభాగాల ను కుదించారు.
ఆమెను సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ), ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీకి మాత్రమే పరిమితం చేశారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి న 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి చారుసిన్హాకు అదనపు డీజీ హోదా కల్పించి.. సీఐడీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, భరోసా విభాగాలను అప్పగించారు. దీంతో గురువారం ఆమె సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.