హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : అమెరికా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్న ఆయనకు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్ఆర్ఐలు జేకేఎఫ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన సీఎం.. ఐటీ, హెల్త్‌కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.