Vote | రెండుచోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
Vote | రాష్ట్రంలో ‘సర్' ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఎవరైనా రెండుచోట్ల ఓటు కలిగి ఉంటే, వారికి ఏడాదిపాటు జైలు శిక్ష పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రెండు ఓట్లు ఉన్న వారిని గుర్తించేందుకు డీఎస్పీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
Vote | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఎవరైనా రెండుచోట్ల ఓటు కలిగి ఉంటే, వారికి ఏడాదిపాటు జైలు శిక్ష పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రెండు ఓట్లు ఉన్న వారిని గుర్తించేందుకు డీఎస్పీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ పురోగతిని వెల్లడించారు.
తెలంగాణవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్నదని, సేకరించిన పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందని వారు, ఓటు ఉండి ఫారం రాని వారు వెంటనే తమ పరిధిలోని బీఎల్వోను సంప్రదించాలని సూచించారు. అర్హులు అందరూ ఎన్యుమరేషన్ ఫారం నింపి ఇవ్వాల్సిందేనని, లేనిపక్షం లో ఓటరు జాబితాలో పేరు రాదని స్పష్టంచేశారు. ఒకవేళ ఇప్పుడు ఫారాలు రాకపో తే, ఆగస్టులో ఫారం-6, ఫారం-8 ఇస్తారని, వాటిని నింపి ఇవ్వవచ్చని పేరొన్నా రు. ‘సర్’ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే ఈసీఐ ఓటరు కార్డు అందిస్తుందని తెలిపారు.
89 లక్షల మంది ‘అనామలీస్’ ఓటర్ల గుర్తింపు
తెలంగాణలో తప్పుడు వివరాలు, అక్షర దోషాలు ఉన్న సుమారు 89 లక్షల మంది ‘అనామలీస్’ ఓటర్లను ఈసీఐ గుర్తించిందని, వారికి త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. 2002 నాటి డాటా లేని ఓటర్లకు నోటీసులు ఇచ్చి ప్రత్యేక సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఏజెన్సీ ఏరియాల్లో 59% ఫారాలు తిరిగి వచ్చాయని, పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఫారాలు అంది డిజిటలైజేషన్ సాగుతున్నదని చెప్పారు. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు ఇస్తరా? లేదా? అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయన ఈ సందర్భంగా పేరొన్నారు.
ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ అప్డేట్ను ఎస్ఎంఎస్ రూపంలో ఎందుకు ఇవ్వడం లేదని అడిగిన ప్రశ్నకు.. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయమని తెలిపారు. 30 ఏండ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నా, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొంటున్నప్పటికీ, ‘సర్’లో ఓటర్లు తమ ఓటును మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. పట్టణ, నగర ప్రాంతాల్లో బీఎల్వోలు ఇండ్ల వద్దకు రావడం లేదన్న ప్రశ్నకు.. వారికి మున్సిపల్ సిబ్బందిని సహాయకులుగా నియమించినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

