ఆదివారం 23 ఫిబ్రవరి 2020
రేపు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం..

రేపు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం..

Feb 15, 2020 , 10:21:23
PRINT
రేపు సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం..

హైదరాబాద్‌: రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనున్నది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటుపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్‌ మీటింగ్ లో పలు నూతన అంశాలపై చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్‌ సమావేశాలపై మంత్రివర్గం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరునున్నట్లు తెలుస్తోంది.
logo