హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.
ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం.