Cabinet Meeting | హైదరాబాద్, జూన్22( నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ (Cabinet Meeting) భేటీ జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలపై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేస్తారని తెలుస్తున్నది.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడును చర్చలకు ఆహ్వానించే అంశంపైనా చర్చిస్తారని సమాచారం. అలాగే సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.