Bandaru Dattatreya | దత్తాత్రేయకు అవమానం.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి బండారుకు అందని ఆహ్వానం
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ఉత్సవాలకు బండారు దత్తాత్రేయను ఆహ్వానించలేదు.
- హైదరాబాద్‌లోనే ఉన్నా పిలువని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- అసహనం వ్యక్తం చేసిన హర్యానా గవర్నర్
- అవమానిస్తున్నారని సీనియర్ల గుర్రు
Bandaru Dattatreya | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర బీజేపీ అవమానించింది. కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు దూరం పెట్టింది. రాష్ట్ర బీజేపీ డైరెక్షన్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ఉత్సవాలకు బండారు దత్తాత్రేయను ఆహ్వానించలేదు. వాస్తవానికి దత్తాత్రేయ గురువారం హైదరాబాద్‌లోనే ఉన్నా పిలువలేదు. ఈ విషయంపై దత్తాత్రేయ కూడా అసహనం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి తనకు ఆహ్వానం పంపలేదని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. తాను తెలంగాణ వ్యక్తినని, ఉద్యమంలో పాల్గొన్నానని, ఇప్పుడు ఓ రాష్ర్టానికి గవర్నర్‌నని అయినా గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి.. గోల్కొండలో జరిగిన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా బీజేపీ సభలా జరిగింది. కిషన్‌రెడ్డి జెండా ఎగురవేయగా, బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, వివేక్ వంటివారే మొత్తం కార్యక్రమాన్ని నడిపించారు.
వేదిక మొత్తం వారే కనిపించారు. కానీ, దత్తాత్రేయను మాత్రం పక్కనబెట్టారు. బీజేపీ నేతగానే కాకుండా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ‘అలయ్-బలయ్’ కార్యక్రమంతో తెలంగాణ సంస్కృతిని చాటిన వ్యక్తిగా దత్తాత్రేయకు మంచి గుర్తింపు ఉన్నది. పైగా ఆయన ప్రస్తుతం గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నా.. ఆహ్వానించక అవమానించడాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశాడని కూడా వారికి గుర్తుకు రాకపోవడం శోచనీయమని అంటున్నారు. కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమ ప్రయోజనం మొత్తం తనకే రావాలనే తపనతోనే ఇలా చేశారని మండిపడుతున్నారు. స్వాతంత్య్ర వేడుకలను సీఎం కేసీఆర్ ఏటా గోల్కొండ కోటలో నిర్వహిస్తుండగా, దీనిని వ్యతిరేకించిన బీజేపీ నేతలు ఇప్పుడు అదే గోల్కొండ కోట మీద బీజేపీ అధికారిక ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

