శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 09:51:26

శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభం

శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభం

కర్నూలు :  శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ జన్‌కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గడిచిన 24 గంటల్లో 42,378 క్యూసెక్కులు నీటిని వినియోగించి 11.327 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను జన్‌కో ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 43,283 క్యూసెక్కులుగా ఉంది.

అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటి మట్టం 843.20 అడుగులుగా ఉంది.  ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 66.8398 టీ.ఎం.సీలు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీ.ఎం.సీలుగా ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo