నాగర్‌కర్నూల్ రూరల్, ఆగస్టు1 : నాగర్‌కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 2 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అదే పాఠశాలలో క్లీనింగ్ పనులు చేసే మహిళ తన పిల్లలను పాఠశాలలో చేర్చుకోవాలని ప్రిన్సిపాల్‌ను కోరింది. స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లెటర్ తీసుకురాగా.. ఒకరికి ఉచితం.. మరొకరి అడ్మిషన్‌కు రూ.10 వేలు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేసినట్టు తెలిసింది.
జీతం రాగానే డబ్బులు ఇవ్వాలని సిబ్బం ది డిమాండ్ చేయగా.. రూ.5 వేలు మాత్రమే ఇస్తానని, అంతకన్నా ఎక్కువ లేవని ఆమె ఫోన్లో వివరించింది. దీనికి వారు వచ్చే నెలలో మిగతా రూ.5 వేలు ఇవ్వాలని సూ చించారు. ఇందుకు సంబంధించిన సంభాషణను ఆమె ఫోన్లో రికార్డింగ్ చేసింది. సంబంధించిన ఆడి యో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రిన్సిపాల్ సుంకన్నను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. సదరు సిబ్బందిని కోర గా.. ఆడియో రికార్డింగ్‌లో మాట్లాడింది.. తాము కాదని.. ఎవరో మార్ఫింగ్ చేశారని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలం కావడంతో పెన్షనర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘాల సమన్వయ కమిటీ ఈ నెల 11న చలో హైదరాబాద్ పేరిట ఇందిరాపార్క్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. శుక్రవారం ముషీరాబాద్‌లోని ఆల్ పెన్షనర్స్ సంఘం కార్యాలయంలో ఆగస్టు 11న ‘చలో హైదరాబాద్ – మ హాధర్నా’ పోస్టర్‌ను, సమస్యల పత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమిటీ నాయకులు డాక్టర్ అరుణ, పాలకుర్తి కృష్ణమూర్తి, కే లక్ష్మయ్య, తులసి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని పెన్షనర్లంతా ఈ ధర్నాకు హాజరై, సర్కారుపై ఒత్తిడి పెంచి, డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.