హైదరాబాద్, జూన్ 23 (నమస్తేతెలంగాణ) : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రేగళ్లపాడు నర్సరీల్లో ఆయిల్‌పామ్ మొక్కల కొనుగోలుతోపాటు సాగుచేసి నష్టపోయిన రైతుల ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ సోమవారం విచారణ జరిపింది. అశ్వారావుపేట, రేగళ్లపాడు నర్సరీల నుంచి 2016-2022 మధ్యలో కొనుగోలు చేసిన మొక్కల్లో ఎదుగుదలతోపాటు పంట దిగుబడి రావడం లేదని అశ్వారావుపేటకు చెందిన గిరిజన రైతు కారం శ్రీరాములు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
స్పందించిన కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ సోమవారం ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో ఉద్యానశాఖ, ఆయిల్‌ఫెడ్ అధికారులను విచారించారు. బాధితుల తోటలను పరిశీలన చేయించి, నెలరోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.