కథలాపూర్, ఆగస్టు 9: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతుల పోరాటం ఫలించింది. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఇటీవల కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా చేసి, కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో అధికారులు 7న ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీరు వదలగా, శనివారం కథలాపూర్ మండలంలోని గ్రామాలకు చేరుకున్నాయి. వరదకాలువ పెగ్గెర్ల, కథలాపూర్, దుం పేట, దూలూర్, తక్కళ్లపెల్లి గ్రామాల మీదుగా వెళ్తుండగా, ఎట్టకేలకు నీళ్లు రావడంతో ఆయా గ్రామాల్లో పంటలసాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి.