KTR | ఆరేళ్ల కిందట అండగా నిలిచిన కేటీఆర్.. నేడు పదో తరగతి పాసై కృతజ్ఞతలు తెలిపిన బాలిక
KTR | ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆనాడు చేసిన సాయం కారణంగానే ఈనాడు ఇలా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది.
KTR | ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆనాడు చేసిన సాయం కారణంగానే ఈనాడు ఇలా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆరేళ్ల క్రితం శరణ్య అనే బాలిక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నదని కుటుంబసభ్యులు సోషల్‌మీడియా వేదికగా కేటీఆర్‌ను సాయం కోరారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారని.. కానీ తమకు అంత స్తోమత లేదని.. పాప పేరుతో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో సర్జరీ చేయించడం కుదరడం లేదని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. ఆర్థిక సాయం అందించారు. అలాగే సంబంధిత అధికారులను ఆదేశించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయించారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న బాలిక.. తాజాగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచిన కేటీఆర్
6 సంవత్సరాల క్రితం ఎక్స్ వేదికగా సహాయం కోరుతూ వేసిన ట్వీట్ పై స్పందించి.. వారికి ఆర్ధిక సహాయం చేసి ఆపరేషన్ చేయించిన కేటీఆర్
అయితే ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో.. కేటీఆర్‌ను కలిసి… https://t.co/UvE3KBFlNA pic.twitter.com/lc7DiwthXX
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2026
దీంతో తాజాగా శరణ్య కుటుంబసభ్యులు కేటీఆర్‌ను కలిసి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆరేళ్ల క్రితం మీరు చేసిన సాయం వల్లే మా బిడ్డ ఇవాళ ఆరోగ్యంగా ఉందని ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ఆరాతీశారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

